మందార పూల గురించి విన్నాం .ఈ మందార పూల టీ ఏమిటి అని అనుమానం వచ్చిందా? జుట్టు ఎదగడానికి మందారం కొబ్బరినూనెలో వేస్తారు ఇంత వరకూ మాత్రమే తెలుసు. నిజమే కొందరు మందారపూల టీ తాగుతారు, ఇది ఒంటికి మంచిదట. అధిక రక్తపోటు లేదా బీపీ చాలా మందిని వేధిస్తోంది.భారతదేశంలో ప్రతి 4 మంది పెద్దలలో ఒకరికి రక్తపోటు ఉంది.
ఆహారంలో మార్పులు , మందులు అధిక రక్తపోటును తగ్గిస్తాయి , అధిక రక్తపోటును నియంత్రించడంలో ఆరోగ్యకరమైన పానీయాలు సహాయపడతాయి.అందులో ఒకటి ఈ మందార పూల టీ. న్యూట్రిషనల్ జర్నల్ లో కూడా దీని గురించి తెలియచేశారు.
మందార పూల రసం రక్తపోటును తగ్గించగలదు. మందార టీలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. అంతే కాదు రక్త నాళాలను సులభంగా నిర్బంధిస్తుంది దీంతో రక్తపోటు తగ్గుతుంది.
కొబ్బరి నీరు
దానిమ్మ రసం
టొమాటో జ్యూస్ ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది.