ఉసిరి కాయ తింటే కలిగే లాభాలు ఇవే

These are the benefits of eating amla

0
68

మనకు అమ్మమ్మలు, నాయనమ్మలు చెబుతూ ఉంటారు. ఉసిరికాయ తినండని. ఏదైనా కడుపు నొప్పి అనిపించినా, నోటి పూత అనిపించినా ఉసిరికాయ నములు లేదా ఉసిరి పచ్చడి అన్నం తిను అని చెబుతారు. ఇప్పటికి నల్ల పచ్చడి, అలాగే తొలి ముద్ద ఉసిరితో తినాలి అని చాలా మంది పెద్దలు చెబుతూ పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉసిరి శరీరానికి అంత మంచిది.
ఉసిరి కాయలు కేవలం జుట్టు, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఉసిరికాయలను గూస్బెర్రీ, ఆమ్లా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇందులో ఏముంటాయి అనేది చూసుకుంటే. విటమిన్ సి, కాల్షియం, భాస్వరం, ఐరన్, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి.

అయితే ఉసిరికాయ నేరుగా తీసుకోలేము తినలేము అనేవారు, ఆమ్లాజ్యూస్ – ఉసిరి పచ్చడి ఇలా తీసుకుంటే శరీరానికి వాటి మంచి గుణాలు అందుతాయి. అయితే వారానికి రెండు సార్లు ఇలా తీసుకోవచ్చు. అతిగా ఉసిరి తీసుకున్నా కడుపులో మంట అనేది వస్తుంది. అందుకే వారానికి ఒకసారి అయినా తీసుకోండి మంచి ఆరోగ్యం పొందవచ్చు.