ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు, కొందరికి ఇది పడుతుంటే మరికొందరికి ఇది పడక అజీర్ణ సమస్యలు వస్తున్నాయి, అంతేకాదు ఆరోగ్యం చెడిపోతోంది, సరైన సమయానికి సరైన ఫుడ్ తినకపోతే చాలా ప్రాబ్లం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా దీని వల్ల పొట్ట ఊబకాయం భారీగా వస్తోంది.
ఇలా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ కూడా ఇబ్బందే. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొవ్వు కొలెస్ట్రాల్ ఫుడ్ బాగా తగ్గించాలి, అయితే సొంపుతో ఈ సమస్య కాస్త తగ్గించుకోవచ్చు, మనం రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలో ఫుడ్ తిన్నా సమయంలో కొందరు సొంపు వేసుకుంటారు.
ఆరోగ్యానికి ఇది మంచిదే చేటు ఏమీ చేయదు.ఇది ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది…ఇక 2 స్పూన్ల సోంపు తీసుకోని 1 గ్లాస్ వాటర్ పోసి సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి. సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ ఉంటాయి, దీని వల్ల కడుపులో ఉబ్బరం జీర్ణ సమస్యలు తగ్గుతాయి
అంతేకాదు సొంపు తింటే నోటి సమస్యలు దూరం అవుతాయి.