వంకాయ తింటే కలిగే లాభాలు ఇవే

These are the benefits of eating brinjal

0
91

వంకాయ అంటే చాలా మందికి ఇష్టం. కొందరు తమ ఫేవరెట్ కర్రీ అంటారు ఈ వంకాయని. గుత్తివంకాయ మసాలా కర్రీ, ఫ్రై, బజ్జీలు, పచ్చడి, ఇలా ఎన్నో రకాలు ఈ వంకాయలతో చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్స్ కూడా ఈ వంకాయని ఇష్టంగా తింటారు .కొంత మందికి ఇది తింటే స్కిన్ ఎలర్జీ వస్తుందని కాళ్ల నొప్పులు వస్తాయని అంటుంటారు. వంకాయ వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేకరకాల విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం మొదలైన పోషకాలు అధికంగా ఉన్నాయి. నియాసిన్, మెగ్నీషియం మరియు రాగి కూడా అందుతాయి.యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కనిపిస్తాయి.

వంకాయలో ఆంథోసైనిన్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యం నుండి ఊబకాయం వరకు అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది.
వంకాయ తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం అనేది తగ్గుతుంది. షుగర్ పేషెంట్లకు ఇది చాలా మేలు చేస్తుంది.
వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.