మనలో చాలా మంది చికెన్ మటన్ తో పాటు చేపలు రొయ్యలు ఇష్టంగా తింటారు. అయితే చేపలు తింటే ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఇలాంటివి కంట్రోల్లో ఉంటాయి. దీంతోపాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ ఈ సమస్యలు రావు. ఇక చేపలు తింటే కలిగే లాభాలు ఏమిటి ఎలాంటి పోషకాలు అందుతాయి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది చూద్దాం.
చేపల్లో కొవ్వు తక్కువ, నాణ్యమైన ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. మనం చాలా యాక్టీవ్ గా ఉండటానికి ఇవి ఎంతో సాయపడతాయి. విటమిన్-డీ, కాల్షియం చేపల్లో పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మన ఎముకలు బలంగా ఉంటాయి. గుండెపోటు బీపీ సమస్య తగ్గిస్తుంది. చేపలు తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
చేపలు తరచూ తీసుకుంటే పలు రకాల కాన్సర్లకు చెక్ పెట్టవచ్చు. ఆస్తమా సమస్య తగ్గుతుంది. నిద్ర సమస్యలు దూరం అవుతాయి. ఐరన్ సమస్య తగ్గుతుంది. గ్యాస్ సమస్య పేగుల్లో సమస్యలు ఉండవు.
గమనిక
కొందరికి చేపలు తింటే అలర్జీ సమస్యలు వస్తాయి వారు చేపలకు దూరంగా ఉండటం మంచిది.