జామకాయలు తింటున్నారా వాటి వల్ల ఉపయోగాలు ఇవే

These are the benefits of eating Guavas

0
115

జామకాయలు చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కాస్త రేటు తక్కువగా ఉండే పండుగా చెప్పాలి జామని. అరటి పండు తర్వాత జామ కూడా రేటు కాస్త తక్కువకే దొరుకుతాయి. అయితే ఇవి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇది డయాబెటిస్ నివారణలో మంచిది. పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా హైపోగ్లైసీమిక్ – గ్లూకోజ్ తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయి.

జామ ఆకుల విషయంలో వాటి ప్రయోజనాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి ఇతర దేశాల్లో. డయాబెటిక్ లు జామకాయ బాగా పండింది కాకుండా, సాధారణంగా ఉన్నది తీసుకోండి. షుగర్ ఉన్న వారికి జామ కాయ రక్తంలో చక్కెరను తగ్గించడం జరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇక మలబద్దక సమస్య ఉన్న వారు జామకాయ తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఉంటుంది.

జామ కాయ ఆకుల గురించి చూస్తే , జామ కాయ ఆకులను ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఔషధంగా ఉపయోగిస్తారు. పలు మందుల తయారీలో జామకాయ ఆకులు వాడతాయి కంపెనీలు. జామ కాయ లీఫ్ టీని ఐరోపా దేశాల్లో బాగా ఇష్టంగా తాగుతారు. అయితే జామకాయ పరగడుపున తినవద్దు. ఏదైనా టిఫిన్ భోజనం చేసిన తర్వాత ఓ గంట రెండు గంటలకు తీసుకుంటే మంచిది.