మనలో చాలా మంది విశేషమైన పండుగల సమయంలో ఉపవాసం ఉంటారు. ఇక కార్తీకమాసం వచ్చింది అంటే చాలా మంది ఉపవాసం ఉంటారు. అలాగ శ్రావణంలో కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాస దీక్ష అంటే ఆరోజు కడుపుని ఖాళీగా ఉంచడం. ఏమైనా పాలు, కొబ్బరినీరు వంటి రసాహారం తీసుకోవడం ఉత్తమం. ఉపవాస నియమాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇలా ఉపవాసం ఉండటం వల్ల కొందరు బరువు తగ్గాలి అనుకునేవారికి మేలు జరుగుతుంది.
కడుపు కూడా ఫ్రీ అవుతుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి. జ్వరములు, జలుబు వ్యాధులు వస్తే అందుకే మితంగా ఆహారం తీసుకోమంటారు. లేదా ఉపవాసం ఉండమంటారు. దీని వల్ల చాలా త్వరగా రికవరీ అవుతారు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు.
రోజూ మూడు పూటల అనేక రకాల ఫుడ్ తింటాం కాబట్టి, జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలి పెరుగుతుంది. క్రిములు తొలగిపోతాయి. ఉపవాసం ఉన్న సమయంలో కాలేయానికి విశ్రాంతి దొరుకుతుంది. దానిలోని మలినాలు కూడా తొలగిపోతాయి. అయితే షుగర్ వ్యాధి, గుండెజబ్బులు ఉన్నవారు చిన్న పిల్లలు ఈ ఉపవాసం చేయకపోవడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు.