ఈభూమి మీద ఉన్న మొక్కల్లో టాప్ 10 లో కచ్చితంగా ఉండేది వేప మొక్క. అనేక ఔషద గుణాలు ఉన్నాయి వేపలో. వేపతో దాదాపు 500 రకాల మెడిసన్స్ తయారు చేస్తారు. ఆయుర్వేదం లో కూడా వేప చాలా రకాల మందుల తయారీకి ,కషాయాలకు ఉపయోగపడుతుంది. వేప ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇప్పటికీ పల్లెల్లో వేప పుల్లలతోనే పళ్లు తోముకుంటారు.
ఇక చర్మసంబంధ వ్యాధులు వచ్చినా వేప ఆకు రసం వేప ఆకు చూర్ణం రాస్తారు. మరి వేప వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, వారానికి ఓసారి అయినా షుగర్ ఉన్న వారు వేప ఆకులు తింటే షుగర్ సమస్య తగ్గుతుంది. గాయాలపై వేప ఆకుల పేస్ట్ రాయడం వలన నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది.
చాలా మందికి చర్మ సంబంధ వ్యాధులు చుండ్రు సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ వేప ఆకులు చూర్ణం రాయడం వల్ల ఈ జబ్బులు తగ్గుతాయి. వేప పుల్లలతో పళ్లు తోముకుంటే చిగుళ్ల సమస్య తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేప ఆకుల పేస్ట్ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య ఉండదు. చుండ్రు కూడా తగ్గుతుంది.