ఆలుబుఖరా పండ్లు తీసుకుంటున్నారా వాటి లాభాలు ఇవే

These are the benefits of taking Alubukhara fruits

0
75

చాలా మంది ఈ మధ్య ఆలుబుఖరా పండ్లు తీసుకుంటున్నారు. వైద్యులు కూడా వీటిని తీసుకోమని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.ఎరుపు-నీలం రంగులో కనిపించే ఆలూబుఖరా పండ్లు రెయినీ సీజన్లో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో పండిస్తారు. ఇవి తీయగా పుల్లగా ఉంటాయి. మంచి పోషకాలు ఉండే పండు ఇది. పొటాషియం ఎక్కువగా వీటిలో ఉంటుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అందుకే వీటిని షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చు. ఈ పండ్లు తింటే మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇవి తింటే ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇవి ఈ సీజన్ లో తింటే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇవి తింటే ఎముకలకు మంచిది. ఎముకల స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి 10 ఏళ్లు దాటిన పిల్లలకు ఇస్తే చాలా మంచిది.