ఉప‌వాసం చేయ‌డం వ‌ల‌న మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే

These are the benefits with fasting

0
79

రోజూ ఆహారం తీసుకోవాలి లేక‌పోతే నిర‌సం వ‌స్తుంది అనే మాట మ‌నం త‌ర‌చూ వింటాం. అయితే మ‌న పెద్ద‌లు పూర్వీకులు క‌చ్చితంగా వారంలో ఓరోజు ఉప‌వాసం ఉండేవారు. దీని వ‌ల్ల వారికి ఆరోగ్యం కూడా ఎంతో బాగుండేది. అయితే దీని వెనుక ఓ కార‌ణం కూడా ఉంది. దీనిని లంక‌నం అనేవారు మ‌న పెద్ద‌లు.
దీని వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉప‌వాసం ఉండ‌టం వ‌ల్ల మన శరీరం అనేక వ్యాధుల నుండి రక్షించబడుతుంది.

మ‌న పెద్ద‌లు వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలని ప్రతి ఒక్కరికీ సలహా ఇస్తారు .
మ‌నం అనేక ర‌కాల ఆహారాలు తింటాము. దీని వ‌ల్ల కొవ్వు, టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోతాయి. దీనిని శరీరం నుంచి తొలగించడం చాలా ముఖ్యం. ఇలా వారానికి ఓరోజు ఉప‌వాసం ఉండ‌టం వ‌ల్ల అవ‌న్నీ కూడా శ‌రీరం నుంచి తొల‌గిపోతాయి.

బ‌రువు పెర‌గం, ఊబ‌కాయం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌క్రియ బాగుంటుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్ త‌గ్గుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వలన BP, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఉప‌వాసం ఉంటే నీరు తాగండి లేదా కొబ్బ‌రినీరు ఇలాంటి ద్ర‌వ‌ప‌దార్దాలు తీసుకుంటే మంచిది. తాజా ప‌ళ్ల రసాలు, మజ్జిగ, పెరుగు, పాలు తీసుకోండి అయితే ఏదైనా అనారోగ్య స‌మస్య‌లు ఉండి, ట్రీట్మెంట్ తీసుకునేవారు అలాగే మందులు వాడేవారు ఇలా ఉప‌వాసాలు చేయ‌వ‌ద్దు అంటున్నారు వైద్యులు.