పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురులు కావాలనుకునే వారికీ ఇవే బెస్ట్ టిప్స్..

0
116

అందంగా కనబడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా మహిళల అందాన్ని పెంచడంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం మారుతున్న జీవన విధానంతో మహిళలు జుట్టు రాలడం, చుండ్రు ఇలా అనేక రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందుకే పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురుల కోసం ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..

మెంతాకు, ఉసిరి, శీకాకాయ, మందార, వేప, కరివేపాకు, గులాబీ రేకలు వీటన్నింటినీ ఎండబెట్టి పొడి చేసుకొని రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున ఒక్కోదాన్నీ చిన్న గిన్నెలోకి తీసుకొని తగినన్ని గోరు వెచ్చని నీటిని కలపాలి. దీన్ని రాత్రంతా నానబెట్టి నూనె రాసిన తలకు పట్టించి ఓ అరగంట తర్వాత హెర్బల్‌ షాంపూతో తలస్నానం చేస్తే అనుకున్న దాని కంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇలా తరచు చేయడం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గడంతో పాటు కొత్త వెంట్రుకలు రావడం మొదలవుతుంది. ఇంకా కుంకుడు కాయలు, శీకాకాయ, ఉసిరి, మెంతులను ఉపయోగించి కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా జుట్టు సమస్యల నుండి ఉపశమనం పొంది ఆరోగ్యంగా ఉంటారు.