మనం చాలా వరకూ నీరు ఎక్కువ తాగుతాం. అయితే వైద్యులు కూడా నీరు ఎక్కువ తాగాలి అని చెబుతారు. ముఖ్యంగా రోజుకి ఐదు లీటర్ల నీరు తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని వైద్యులు కూడా తెలియచేస్తారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. అయితే ఎక్కువగా నీరు తాగినా సమస్యలు వస్తాయట.
శరీరంలో అధిక హైడ్రేషన్ కారణంగా శరీరంలో రక్తం స్థాయి చాలా తక్కువగా మారుతుంది. ఇలా వస్తే కొందరిలో మెదడులో వాపు కూడా ఉండవచ్చు. ఎక్కువ నీరు తాగడం వల్ల మీకు అపానవాయువు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరంలో నీరు అధికంగా చేరడం వల్ల ముఖం, శరీరంలోని ఇతర భాగాలలో వాపు వస్తుంది.
కొందరికి అతిగా నీరు తాగితే వాంతుల సమస్యలు వస్తాయి. ఎందుకు అంటే మూత్రపిండాలు ఎక్కువ నీరు తీసుకోవు. దీని వల్ల మీ శరీరంలో నీరు అధికంగా నిల్వ ఉంటుంది. ఒక్కోసారి కాళ్లు చేతులు తిమ్మిరి కూడా వస్తాయి. అందుకే సమానంగా నీరు తీసుకోండి అంటున్నారు వైద్యులు.