ప్రస్తుత పరిస్థితుల్లో జలుబు చేసిందని కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నాం. దీనికి కారణం కరోనా మహమ్మారి. ఇప్పటికే కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుంది. అయితే ప్రస్తుతం సాధారణ జలుబుకు, ఒమిక్రాన్ కు తేడాలు గుర్తించలేకపోతున్నారు. దీనితో వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేక వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. మరి సాధారణ జలుబు, ఒమిక్రాన్ మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా ప్రారంభమైనప్పుడు జలుబు, కోవిడ్-19 మధ్య తేడాను గుర్తించడం సాధ్యం కాదు. కానీ, దాని కేసులు పెరగడం ప్రారంభించి, ప్రభావాలు కనిపించడంతో తేలికపాటి జలుబు, చలి కూడా ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒమిక్రాన్ లక్షణాలకు మాములు జలుబు లక్షణాలు తేడాలను తెలుసుకుంటే భయాదోంళనలు ఉండవు. వీటిని తెలుసుకున్న తర్వాత ఒమిక్రాన్ పాజిటివ్‌గా ఉన్నారా లేదా చలికి గురయ్యారా అనేది మీరు సులభంగా తెలుసుకోవచ్చు.
సాధారణ జలుబు లక్షణాలు
సాధారణ జలుబులో తలనొప్పి, ముక్కు కారటం ఉంటుంది.
జలుబులో, మీరు అలసిపోయినట్లు అనిపించదు. కానీ చికాకుగా అనిపిస్తుంది.
తలలో తుమ్ముల భారంతో ఎక్కువగా నొప్పి కూడా వస్తుంది.
సాధారణ జలుబులో, గొంతు నొప్పి ఉండదు. కానీ, ముక్కు లోపల పొడి లేదా జలదరింపు ఉంటుంది.
ఒమిక్రాన్ లక్షణాలు
ఇప్పటివరకు బయటకు వచ్చిన ఒమిక్రాన్ లక్షణాలపై ఆరోగ్య నిపుణులు ఈ కింది విషయాలు తెలిపారు.
నిరంతర తలనొప్పి
అలసట
కీళ్ళ నొప్పి
చలి
గొంతు నొప్పి సమస్య లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.