ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎత్తు పెరగడం లేదని చింతిస్తున్నారు. తమ పిల్లలు ఎత్తు పెరగలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు హైట్ పెరగకపోవడం సమస్యతో బాధపడడం మనం గమనిస్తుంటాము.
హైట్ పెరగకపోవడం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. పోషకాహార లోపం, సరైన జీవనశైలి లేకపోవడం కూడా కారణం అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు లేరని బాధపడేవారు ఇక ఏ మాత్రం బాధపడకుండా కింద చెప్పే చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎత్తు పెరగవచ్చు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..
సహజసిద్ధంగా లభించే ఆహారాల్లో బఠాణీలు కూడా ఒకటి. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ వంటివి వీటిలో అధికంగా ఉంటాయి.ఈ బఠాణీ గింజలను తీసుకునే వారు తప్పకుండా ఎత్తు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో సహజసిద్ధ కూరగాయ బెండకాయ. ఇందులో ఉండే పిండి పదార్థాలు, నీరు, ఖనిజాలు ఇతర పోషకాలు ఎత్తు పెరగడంలో అద్భుతంగా పని చేస్తాయి.