మనం ఏది అయినా పుల్లటి ఆహారం తినాలి అని అనుకుంటే వెంటనే చింతపండుని తీసుకుంటాం, దానితో పులిహార ఇలా
పుల్లటి కూరలు అనేక రకాలు చేసుకుంటాం… అయితే అతిగా తింటే ప్రమాదం కానీ మితంగా తీసుకుంటే దీని వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు వైద్యులు, మరి చింతపండుతో ఈ పులుపు పండుతో ఎలాంటి ప్రయోజనాలు అనేది చూద్దాం.
చింతపండులో ఫైటో న్యూట్రియెంట్స్ వలన బాడీ హెల్దీగా ఉంటుంది. ఇందులో టార్టారిక్ యాసిడ్ ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, చింత పండు మెటబాలిజం ని స్టిమ్యులేట్ చేస్తుంది. అతిగా తింటే ఇబ్బంది కాని మితంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్ధకు మంచిదే. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం ఉండదు… ఇందులో పొటాషియం ఉంటుంది ఇది బ్లడ్ ప్రషర్ ని కంట్రోల్ చేస్తుంది.
ఇక జంక్ ఫుడ్ కంటే దీనితో చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. ఇక ఇమ్యూనిటీ పవర్ బూస్టింగ్ కు పనిచేస్తుంది.
చింత పండులో విటమిన్ సీ ఉంటుంది. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సో మీరు మితంగా తీసుకుంటే మంచిదే అంటున్నారు వైద్యులు.
|
|
చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
-