వినాయక చవితి అనగానే మనకు పత్రి గుర్తు వస్తుంది వినాయకుడి పూజలకు పిల్లలు అందరూ ముందు రోజు ఈ పత్రి తీసుకువస్తారు. గతంలో గ్రామాలు తోటల్లో ఈ పత్రి తెచ్చేవారు ఇప్పుడు మార్కెట్లో కొనుక్కుంటున్నాం. ఈ పత్రి పూజలో వాడే ఆకుల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వినాయక చవితికి గణేషుడిని 21 రకాల పత్రితో పూజిస్తాం. ప్రతి ఒక్క పత్రి ఎన్నో అనారోగ్య సమస్యలను తీరుస్తుందని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఈ పత్రి ఏమిటి వాటిలో ఔషద గుణాలు ఏమిటో చూద్దాం.
1. గరకి దీనిలోని మనకు రోగ నిరోధక శఖ్తిని పెంచే గుణాలు ఉన్నాయి
2. మాచీ పత్రం వీటి నుంచి సువాసన వస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
3. తులసి శరీరం వేడిగా ఉంటే ఇది చల్లబరుస్తుంది.
4.మారేడు షుగర్ వ్యాధి ఉన్నవారు మారేడు మంచి ఔషధం.
5.ఉత్తరేణి దగ్గు, ఆస్తమా సమస్యలను తగ్గించడంలో ఈ ఆకులు బాగా పనిచేస్తాయి.
6.ములక ఈ ఆకు శ్వాస కోశ సమస్యలను ఉబ్బసం ఉన్నవారికి నయం చేస్తుంది
7.ఉమ్మెత్త శ్వాసకోశ వ్యాధులను ఆస్తమాని తగ్గిస్తుంది
8.రేగు చర్మ సమస్యలు ఉన్నవారికీ రేగు ఆకులు మంచి చేస్తాయి
9.గన్నేరు గడ్డలు, పుండ్లు, గాయాలు మానడానికి ఉపయోగపడతాయి
10 ధవనం, మరువం ఇవి ఎంతో సువాసన వస్తాయి వీటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది
11.మామిడి నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు ఈ సమస్యలు తగ్గుతాయి.
12. విష్ణుక్రాంత పత్రం- ఈ ఆకులతో చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది
13.జమ్మి నోటి సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.
14.వావిలాకు కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు ఈ ఆకును వాడితే ఉపయోగం ఉంటుంది
15.రావి చర్మ సమస్యలు వారికి రావి ఆకులు బెస్ట్ మెడిసిన్
16. దానిమ్మ ఈ ఆకులు విరోచనాలకు మంచి మెడిసన్
17.జాజిమల్లి చర్మ సమస్యలున్నవారు వీటిని వాడితే మంచిది
18.మద్ది గుండె ఆరోగ్యానికి ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
19..జిల్లేడు నరాల బలహీనత కు మంచి ఔషదం
20. లతాదూర్వా అతిమూత్ర సమస్య వారు వీటిని వాడవచ్చు
21. దేవదారు పత్రం వేడి ఉన్న వారు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.
ఆయుర్వేదంలో ఇలా ఒక్కో ఆకుని ఈ విధమైన అనారోగ్యాలకి మెడిసన్ గా వాడతారు.