గర్భిణీలు చెరుకు రసం తాగడం వల్ల బోలెడు లాభాలు..

0
121

ప్రతి ఒక్క మహిళ జీవితంలో తల్లికావడమనేది ఓ అద్భుత వరం. అందుకే మహిళలు గర్భిణీలుగా ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే పిండం ఎదుగుదల తల్లి తీసుకునే ఆహారంపైనే ఆధారపడుతుంది.

ముఖ్యంగా గర్భధారణ సమయంలో జ్యూస్ లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవచ్చా లేదా అని సందేహపడుతుంటారు. చెరకులో విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి5, బి6 మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల తల్లికి, కడుపులో పెరుగుతున్న పిండానికి ఎంతో మేలు చేస్తుంది.

చెరకు రసం గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనది మరియు ఆరోగ్యకరమైనది. గర్భధారణ సమయంలో చెరుకు రసం తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. కానీ మధుమేహం లేదా గర్భధారణ మధుమేహం ఉన్నట్లయితే  గర్భధారణ సమయంలో చెరుకు రసం తాగకపోవడమే మంచిది.