చాలా మంది రాత్రి అన్నం ఎక్కువ తిన్నాం కదా ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ వద్దులే అనుకుంటారు. మరికొందరు మధ్నాహ్నం లంచ్ ఎక్కువ తీసుకుందాం ఇక ఉదయం టిఫిన్ వద్దులే అనుకుంటారు. కాని మీరు ఓ విషయం గుర్తు పెట్టుకోండి. బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు మానవద్దు. అయితే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం.
ముందుగా మీరు బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మీకు అసిడిటీ గ్యాస్ సమస్య మొదలు అవుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. కడుపు ఖాళీగా ఉండటం వల్ల చేసే పనిపై ఫోకస్ ఉండదు.పోషకాలు కోల్పోయే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. పెద్దలు బ్రెక్ ఫాస్ట్, పిల్లలు పాలు స్కిప్ చేయడం వలన కాల్షియం లోపం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
విటమిన్ సి తోపాటు, పలు విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ డి, ఐరన్ లోపం 18 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. బ్రెక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారు క్రమంగా బరువు పెరుగుతారు. ఈ సమయంలో షుగర్ పదార్దాలు ఎక్కువ తినడం వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి.