గుండెజబ్బులు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్. అసలు గెండెపోటు అంటే ఏంటి? ఈ గుండెపోటు అనేది ఎవరికి వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? ఏ వయసు వారికి గుండెసమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మనం తీసుకునే ఆహరం, ఒత్తిడే గుండెకు సంబంధించిన వ్యాధులకు ప్రధాన కారణం అంటున్నారు వైద్య నిపుణులు. బయట తిండి తినడం, ప్రస్తుతం తీసుకునే ఆహరంలో అంతగా పోషకాలు లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. సిగరెట్ తాగడం, బిపి, డయాబెటిస్ తో గుండె సమస్యలు సర్వ సాధారణమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100లో 20 నుండి 30 మంది హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు.
30 మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వీరందరూ అధిక ఒత్తిడితోనే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే అధిక బీపీని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అలాగే ఇండియాలో యువతకు ఈ గుండె సమస్యలు పెరుగుతున్నాయి. దానికి కారణం హైపర్ టెన్షన్, షుగర్, బరువు అధికంగా ఉండడం. వయసుతో వచ్చే జబ్బులను మనం గుర్తించి నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.