మెంతులు ఇవి చూడగానే అమ్మో చేదు అంటాం, అయితే శరీరానికి ఇవి చాలా మంచిది, అంతేకాదు చారు రసంలో మెంతులు వేసి తింటే ఇంకా టేస్ట్ ఉంటాయి, అలాగే శరీరంలో మలినాలు పోతాయి ఇన్ ఫెక్షన్లు వ్యాధులు ఉన్నా తగ్గుతాయి.
షుగర్ పేషంట్లకు కూడా చాలా మంచిది, ఇక కర్రీలో మెంతి పొడి వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మెంతులను బాగా నానబెట్టి రుబ్బిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. ఇక మెంతులు రాత్రి నానబెట్టి ఆ మెంతులని నమిలి చాలా మంది తింటారు, జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
అసిడిటి చాలా మందికి ఉంటుంది ఈ సమస్య పోవాలి అంటే నానబెట్టిన మెంతులు తినాలి, ఉదయం
నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నానబెట్టిన అర టీస్పూన్ మెంతులు తినాలి.. దీంతో మీకు అసిడిటీ ఉంటే తగ్గుతుంది.
ఇక షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఇలా నానబెట్టిన మెంతులు తింటే చక్కెర స్ధాయి పెరగదు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి, ఇక లావుగా ఉన్నాము అని బాధపడేవారు ఇవి తింటే చాలా మంచిది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఓనెల తిని చూడండి మీకే ఫలితం కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు.