ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్య లేకుండా డిస్పోజబుల్ కూడా ఇప్పుడు మార్కెట్లో వచ్చాయి. అయితే బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర యూజ్ అండ్ త్రో వస్తువులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ .అయితే రైతులకి కూడా దీని వల్ల చాలా ఉపయోగం.
ఈ బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, గ్లాసులు బిజినెస్ చాలా బాగుంది. పర్యావరణానికి పూర్తి రక్షణగా ఈ వ్యాపారం ఉంటుంది పిక్నిక్స్, పెళ్లిళ్లు, పార్టీలు ఇలాంటి వేడుకల్లో భోజనాలకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా బయో కంపోస్టబుల్ టేబుల్వేర్ ఎంచుకోవచ్చు.
ఇవి చెరకుపిప్పితో తయారు చేస్తారు. పర్యావరణంలో తేలికగా కలిసిపోయి భూసారానికి తోడ్పడతాయి. చెరకు పిప్పితో ఈ ప్లేట్స్ ముందు చైనాలో ప్రారంభించారు. వెదురు, పామ్, చెరకు గుజ్జు వ్యవసాయ వ్యర్థాల నుండి పర్యావరణ అనుకూలంగా ప్లేట్స్ చేస్తారు. చెరకు పిప్పి కొద్ది రోజులు నానబెట్టి యంత్రాలలో ప్రాసెస్ చేస్తారు. ఈ ప్లేట్లు చెత్తలో విసిరినప్పుడు 90 రోజుల్లో కుళ్ళిపోతుంది. జంతువులు వీటిని తిన్నప్పటికీ, హానికరం కాదు.