ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే చాలామంది పచ్చి మామిడికాయ తినడానికి ఇష్టపడరు. కానీ పచ్చి మామిడికాయ తినడం అలవాటు చేసుకుంటే ఈ సమస్యలు దరి చేరవు. ఎందుకో మీరు కూడా చూడండి..
పచ్చి మామిడిలో విటమిన్ ఎ, బి6, సీ, కే వంటి విటమిన్లు పుష్కలంగా లభించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు. వేసవిలో త్వరగా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడంతో పాటు..వడదెబ్బ తగలకుండా కూడా కాపాడుతుంది. అందుకే ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్ళు వేసవిలో వీటిని తీసుకోవడం మంచిది.
వేసవి కాలంలో జీర్ణసమస్యల నుండి ఉపశమనం పొందాలన్న, జీర్ణాశయం బలోపేతం కావాలన్న పచ్చి మామిడి ముక్కలను తీసుకోవటం మంచిది. ఇవి అధికంగా తినడం వల్ల కేవలం ఆరోగ్యపరంగా ప్రయోజనాలే కాకుండా..చర్మాన్ని కాపాడంలో కూడా సహాయపడుతుంది. కానీ కడుపునొప్పి లేచిన వారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.