Sexual Health | కొంతమంది పురుషులు లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లైంగిక జీవితంలో సంతృప్తి లేక, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్ కి లోనవుతుంటారు. ఒక్కోసారి సమస్య చిన్నదే అయినప్పటికీ పరిష్కారం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సమస్యలకి మనం తినే ఆహారంతోనే చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మనం తినే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకుంటే లైంగిక సామర్థ్యం మెరుగు పడుతుంది అని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.
అరటిపండ్లు: అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.
ఆరెంజ్: ఆరెంజెస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచడం ద్వారా అంగస్తంభన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పుచ్చకాయ: పుచ్చకాయలో ఎల్-సిట్రలిన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
దానిమ్మ: రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పురుషాంగం వాపును తగ్గించే యాంటీఆక్సిడెంట్లకు దానిమ్మ మంచి మూలం.
చెర్రీస్: చెర్రీస్‌లో ఆంథోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ, లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.
పియర్స్: పియర్స్ పండ్లలో విటమిన్ సి, పొటాషియంలు అధికంగా ఉంటాయి. ఇవి అంగస్తంభన పనితీరును మెరుగుపరుస్తాయి.
ద్రాక్ష: ద్రాక్షలో రెస్వెరాట్రాల్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని, లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.
ఆల్ బుకారా: ఆల్ బుకరా పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవి లైంగిక పనితీరును(Sexual Health) మెరుగుపరుస్తాయి.