Uric Acid Problem | శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇది మూత్రపిండాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. బీపీ పెరగడంతో పాటు కీళ్ల నొప్పులు, నడవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యతో వైద్యులను సంప్రదిస్తే వాళ్లు ఎక్కువగా నీరు తాగాలి, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని చెప్తారు. అదే విధంగా యూరిక్ యాసిడ్‌ను పెంచే ఆహారా పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని చెప్తారు. అయినా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటాం. దీని కారణంగా నిత్యం నిద్రలేచినప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ యూరిక్ యాసిడ్ సమస్యకు కొన్న పండ్లు తినడం ద్వారా చెక్ చెప్పొచ్చని పోషకాహారా నిపుణులు చెప్తున్నారు.అవేంటంటే
అరటి పండు.. వీటిలో బీ12 విటమిన్ బాగుంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో పాటుగా అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
యాపిల్.. యూరిక్ యాసిడ్ సమస్యతో(Uric Acid Problem) బాధపడేవారు ప్రతి రోజూ ఒక యాపిల్ తినాలి. తద్వారా వారికి యూరిక్ యాసిడ్ సమస్య ఒక్కటే కాకుండా మనకు తెలియని మరెన్నో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వీటితో పాటుగా కీవీ, అనాస పండు, పుచ్చకాయ తినడం వల్ల కూడా యూరిక్ యసిడ్ సమస్యకు చెక్ చెప్పొచ్చని నిపుణులు చెప్తున్నారు.