డెలివరీ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

0
118

మహిళలు పిల్లలకు జన్మనివ్వడం అనేది దేవుడు ఇచ్చిన ఒక వరం. మహిళలు ప్రసవించడం అంటే పునర్జన్మ ఎత్తడం అని అంటారు. ప్రసవం అప్పుడే కాదు డెలివరీ తర్వాత కూడా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేవలం శారీరక ఇబ్బందులే కాదు మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెపుతున్నారు. మరి అలాంటప్పుడు డెలివరీ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

డెలివరీ సమయంలో ఒత్తిడికి గురయ్యే కండరాలను బలోపేతం చేయడానికి వైద్యుల సలహాతో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. డెలివరీ తర్వాత పాల ఉత్పత్తి పెరగాలంటే యోగా చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. యోగా వల్ల శరీరానికి, మనసుకు ఉపశమన కలుగుతుందని అంటున్నారు. కండరాల్లో కలిగే ఒత్తిడి, ప్రసవంలో కలిగిన ఆందోళన యోగాతో దూరమవుతాయని చెబుతున్నారు.

డెలివరీ తర్వాత కుంగుబాటుకు గురైన వారికి శవాసనం మంచి ఫలితాన్నిస్తుందని తెలిపారు. ప్రొటీన్లు, పీచు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాహారాన్ని ఎంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం కావాలి. పాల ఉత్పత్తులు తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యం పెంపొందుతుంది. మసాలాలు, కెఫైన్‌, నిల్వ ఆహారాలు, ప్రాసెస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది.