గోళ్లు అందంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

0
100

అందంగా కనిపించడంలో చేతి వేళ్లు, గోళ్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే చక్కనైన చేతి గోళ్లు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికోసం అమ్మాయిలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సింపుల్ చిట్కాలు..

గోళ్లను సంరక్షిస్తూ కొన్ని చిట్కాలు పాటిస్తే అందమైన గోళ్లను సొంతం చేసుకోవచ్చు. మొదటగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తినడం వల్ల గోటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.  అన్ని సమస్యలు జెర్మ్స్ మరియు బ్యాక్టీరియాతో ప్రారంభమవుతాయి. కావున మీ గోళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి మరియు కడిగిన తర్వాత వాటిని పొడిగా ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి.

ముఖ్యంగా అందరికి ఉండే  గోర్లు కొరకే అలవాటు వల్ల చాలా నష్టం చేకూరుతుంది. ఇష్టారీతిగా కొరకడం వల్ల అంద విహీనంగా కనిపిస్తాయి. నెమ్మదిగా మరియు సున్నితంగా మరియు ఒక దిశలో కత్తిరించడం మంచిది, లేదంటే గోర్లు బలహీనంగా మరియు ముందుగానే విరిగిపోయి అవకాశం ఉంటుంది. గోర్లు ఎక్కువగా పెరగనివ్వవద్దు. వాటిని ఎల్లప్పుడూ సమంగా మరియు చక్కగా కనిపించేలా ఉంచండి.