ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను తప్పక పాటించాల్సిందే!

0
91

ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాం. అయితే దానికి కొన్ని సూత్రాలను పాటించక తప్పదు. ఇందులో మీరు చేయలేనివి, కష్టసాధ్యమైనవీ ఏమీ లేవు. వాటిని అనుసరించాలన్న పట్టుదల ఉంటే… మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి రోజూ వర్కవుట్లు చేయండి. వ్యాయామం కోసం కనీసం ఓ గంటైనా కేటాయించాలి. ఇంటా, బయటా పనులు… అలసిన మనసు సేద తీరాలంటే మీకు నచ్చిన పని కోసం రెండు గంటలు కేటాయించాల్సిందే. పుస్తక పఠనం, గార్డెనింగ్‌, కుటుంబంతో గడపడం ఈ పనులకు కనీసం రెండు గంటలు కేటాయించాలి.

ఆరోగ్యం కావాలా ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. ఈ సూత్రాన్ని తప్పక పాటించాలి. పోషక భరిత ఆహారాన్ని రోజులో మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తప్పక తీసుకోవాలి.

వ్యాయామం, పని ఇలా వీటి నుంచి శరీరం, మనసుకు కాస్తంత విశ్రాంతిని కల్పించాలి. అందుకే రోజులో కనీసం నాలుగు స్వల్ప విరామాలు ఇస్తుండాలి.

ఆరోగ్యాన్నిచ్చే అంశాల్లో ఆహారాన్ని ప్రముఖమైందిగా చెప్పొచ్చు. పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజులో అయిదు రకాల పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి నుంచి లభించే పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయి.

చేసే పని మీద దృష్టి పెట్టాలంటే ఏకాగ్రత ఎంతో అవసరం. అది ధ్యానం చేయడం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి రోజూ కనీసం అయిదారు నిమిషాలు ధ్యానం చేయండి.

జీర్ణక్రియలు, జీవక్రియలు సాఫీగా జరగాలంటే నీళ్లు తాగడం చాలా అవసరం. రోజులో కనీసం ఏడు గ్లాసుల నీళ్లు తాగాల్సిందే.

ఆరోగ్యం సొంతమవ్వాలంటే… ఆహారం, వ్యాయామంతోపాటు శరీరానికి తగినంత విరామం ఉండాల్సిందే. అంటే తగినన్ని గంటలు నిద్రపోవాలి. రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.

వంద మైళ్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అడుగులేయాల్సిందే. అదేనండీ రోజులో దాదాపు 9000 అడుగులు వేయడం వల్ల బరువు తగ్గి, హెల్తీగా ఉండొచ్చట.