దేవాలయానికి వెళ్లినప్పుడు ఈ పనులు చేయకూడదు

These things should not be done while going to the temple

0
95

కోవెలకు వెళ్లిన సమయంలో ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆ ఆధ్యాత్మిక ప్రదేశానికి ఎంతో ప్రశాంతత కోసం, పుణ్యం కోసం భక్తులు వస్తారు. మనం కూడా ఆలయంలో పక్కవారి ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండాలి. ముఖ్యంగా ఆలయాలకు వెళ్లే సమయంలో అక్కడకు వెళ్లిన తర్వాత కొన్ని పనులు చేయకూడదు అవి తెలుసుకుందాం.

1. కచ్చితంగా ఆలయానికి వెళ్లేవారు స్నానం చేసి వెళ్లాలి.
2.శుభ్రమైన దుస్తులు అంటే కచ్చితంగా ఉతికిన దుస్తులు వేసుకోవాలి.
3. మనం కచ్చితంగా సైలెంట్ గా ఉండాలి ఇక్కడ అనవసర మాటలు మాట్లాడకూడదు.
4. ఆలయంలో భక్తులకి ఏమైనా ఉపదేశం చేస్తున్న సమయంలో ఎవరిని దూషించకూడదు
5. గట్టిగా అరవడం బిగ్గరగా మాట్లాడటం చేయకూడదు
6. వేరొకరి గురించి చాడీలు చెప్పడం వినడం కూడా మంచిది కాదు
7. ఎవరి కుటుంబంలో అయినా మైల ఉంటే వారు ఆలయానికి వెళ్లకూడదు
8. ఆలయం బయట దానం చేసిన సమయంలో చెప్పులు వేసుకోకూడదు
9.ప్రదక్షిణలు వేగంగా చేయకూడదు. మనస్సులో తలచుకుని చేయాలి
10. దేవాలయంలో వస్త్ర ధారణ పవిత్రత కాపాడే విధంగా ఉండాలి