ఇప్పుడు చాలా మంది తేనె బాగా వాడుతున్నారు, అనేక ఆహార పదార్దాలు కూడా సహజంగా దొరికే తేనెతో తయారు చేస్తున్నారు, ఇవి ఎంతో టేస్ట్ ఉంటాయి, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అయితే తేనె అనేక రకాల కంపెనీలలో దొరుకుతోంది, పుట్టె తేనె దొరకడం నేరుగా తేవడం తగ్గిపోయింది, కాని అది ఒంటికి చాలా మంచిది అంటున్నారు డాక్టర్లు.
తేనె అద్భుతమైన నేచురల్ సప్లిమెంట్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి అందం వస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్ధ కూడా చాలా మెరుగు అవుతుంది.
గోరు వెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది, అంతేకాదు పలు అలర్జీలు కూడా తగ్గుతాయి. తేనె నిత్యం ఉదయం తీసుకోవడం వల్ల మీ ఎనర్జీ లెవర్స్ బాగుంటాయి అంటున్నారు, అంతేకాదు ఒక చెంచా తేనె తీసుకుంటే దాదాపు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ యాక్టీవ్ గా ఉంటారు. కాఫీలు టీలలో తేనె తీసుకోవద్దు అంటున్నారు వైద్యులు, ఇక ఉదయం లేదా మధ్యాహ్నం చాలా మంది సెలబ్రెటీలు టీ తాగకుండా, హనీ వాటర్ తాగుతున్నారు ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.