వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది.
అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలయిన తొలగిరిపోతాయి. అధిక రక్తపోటు కూడా మూత్రపిండాలకు హాని కలిగేలా చేస్తుంది. కావున ఉప్పు తీసుకోవడం తగ్గించడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండడం వల్ల రక్తపోటు స్థిరంగా ఉండి కిడ్నీలకు కూడా ఎలాంటి హాని కలుగదు.
శరీరం నుంచి అదనపు సోడియం, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి నీరు మూత్రపిండాలకు నీరు అద్భుతంగా ఉపయోగపడుతాయి. కావున రోజుకు 8 గ్లాసుల నీరు తాగడానికి ప్రయత్నించడం వల్ల హైడ్రేట్ గా ఉండడంతో పాటు..అన్ని సమస్యలు తొలగిపోతాయి. పొగాకు రక్తనాళాలను దెబ్బతీసి మూత్రపిండాల ద్వారా రక్త ప్రసరణను తగ్గించడానికి కారణమవుతుంది. కావున ఈ అలవాటు ఉన్నవారు వీలయినంత త్వరగా మానుకోవడం మంచిది.