కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి, మోడెర్నా ఈ నాలుగు టీకాలు మన దేశంలో వ్యాక్సిన్ గా ఇస్తున్నారు. కోట్లాది మంది ఈ టీకాలు ఇప్పటికే తీసుకున్నారు. వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
అయితే ఈ నాలుగు టీకాలు పాలిచ్చే మహిళలు, గర్భిణులకు సురక్షితమైనవేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వీటిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారు.దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ ఇంకా కొన్ని పరిశీలనలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.
అయితే గర్భిణీలు కూడా టీకా తీసుకున్నాక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారికి టీకా ఇచ్చే సమయంలో కౌన్సిలింగ్ ఇస్తారు. దానికి సంబంధించి ఆరోగ్య శాఖ ఓ గైడ్ తయారు చేస్తోంది. దానిని ఆరోగ్య శాఖ ప్రంట్ లైన్ వర్కర్లకు ఇస్తారు. కౌన్సిలింగ్ లో పాటించాల్సిన జాగ్రత్తలు గర్భిణీలకు తెలియచేస్తారు.
ఇప్పటివరకు కరోనా సోకిన గర్భిణుల్లో 90 శాతం మంది కోలుకున్నారు. కచ్చితంగా వారు బయటకు రాకుండా మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.