మనం ఎక్కువగా బాదం జీడిపప్పు పిస్తా అలాగే కిస్ మిస్ ద్రాక్ష ఖర్జూరం ఇవే తీసుకుంటాం…ఇంకో విషయం చెప్పాంటే చాలా మంది వాల్ నట్స్ ఇటీవల తీసుకుంటున్నారు … గతంలో వీటిని పెద్దగా తినేవారు కాదు చెప్పాలంటే మార్కెట్లో కూడా పెద్దగా దొరికేవి కాదు… సో ఇవి చూస్తే సేమ్ మెదడు ఆకారంలో ఉంటాయి, అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఒత్తిడులను అధిగమించాలంటే రోజూకు ఓ గుప్పెడు వాల్ నట్స్ తీసుకుంటే సరిపోతుందట.
వాల్ నట్స్ లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రెషన్ ని తగ్గిస్తాయి, ఇక మీరు వీటిని నానబెట్టుకుని కూడా తీసుకోవచ్చు, ఇక ఈ వాల్ నట్స్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ సమృద్దిగా ఉన్నాయి, ఇక చాలా మంది వీటిపై తొక్క ఉంటుంది దానితో తింటారు ఆ తొక్క తీసి తినండి.
అయితే పచ్చిగా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి…ఇక మరో ముఖ్యమైన విషయం ఇవి గుప్పెడు తింటే ఓ పూట వరకూ ఆకలి వేయదు.. మంచి ఫ్యాట్ కూడా దీని ద్వారా వస్తుంది…. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.ఇక గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు.