చిగుళ్ల సమస్యలను దూరం చేసే అద్భుతమైన ఔషధం ఇదే..

0
92

ఈమధ్య కాలంలో చిగుళ్ల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండగా..ముఖ్యంగా మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల దంతాల సమస్యలతో పాటు చిగుళ్ల సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా పళ్ళు పసుపు రంగులోకి మారడం కూడా జరుగుతుంది. దాంతో ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వివిధ రకాల మందులు, చిట్కాలు పాటిస్తూ ఉంటారు.

వాటివల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమస్యను దూరం చేయడంలో తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చేబుతున్నారు.  తులసి ఆకులలో 71% యూజీనాల్, 20% మిథైల్ యూజీనాల్ మిగతా 9% ఇతర పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా తులసి ఆకులలో కార్వాక్రోల్, టేర్పెన్ వంటి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉండటం వల్ల నోటిలో క్రిములపై పోరాటం చేసి నోటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

దీనివల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజు 6 లేదా 7 తులసి ఆకులను నములుతూ ఉంటే పళ్ళు తెల్లగా మారడమే కాకుండా బలంగా ఉంటాయి. అలాగే చిగుళ్ల సమస్యలు కూడా దూరం అవడంతో పాటు దుర్వాసన నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. తులసిలో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఏడూ రోజుల్లోనే దంతాలను తెల్లగా మారుస్తాయి.