ఐరన్ లోపం ఉన్న వారికి ఇదే బెస్ట్ ఫుడ్..

0
109

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు, లవణాలు ఇలా అన్ని రకాల పోషకపదార్థాలు ఉన్న ఆహారాలను తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు మనదరికి చేరవు. కానీ ఈ మధ్యకాలంలో ఐరన్ లోపంతో బాధపడువారి సంఖ్య పెరుగుతుంది.

ఈ ఐరన్ లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. గర్భిణీలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఐరన్‌ లోపం కారణంగా తక్కువ బరువున్న పిల్లలు పుట్టే అవకాశాలుంటాయి. అందుకే ఇలాంటి వారు ఈ ఆహారపదార్దాలు తీసుకోవడం మంచిది. పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. అలాగే పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్ ఉంటుంది. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తినాలి. బెల్లంతో వేరుశెనగలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది.