దసరా దీపావళి వచ్చింది అంటే స్వీట్స్ కు యమా డిమాండ్ ఉంటుంది.. అంతేకాదు ఈ సమయంలో డ్రైఫ్రూట్స్ బాగా కొంటారు ఆఫీసుల్లో ఇవే కానుకలు ఇస్తూ ఉంటారు, ఇక జీడిపప్పు బాదం ద్రాక్ష పిస్తాకు యమా డిమాండ్ ఉంటుంది.
అయితే గత 10 రోజులుగా వీటి ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా బాదం ధరలు భారీగా తగ్గిపోయాయి.
లాక్ డౌన్ కు ముందు, డ్రై ఫ్రూట్స్ 20 శాతం ఖరీదు పెరిగాయి. అయితే పాత వస్తువులు అయిపోతున్న సమయంలో కొత్త పంటల రాక జరుగుతోంది, ఇప్పుడు మార్కెట్లో వీటి ధరలు కాస్త తగ్గుతున్నాయట, బయట కొనుగోలు తగ్గింది దీంతో రేటు తగ్గింది అంటున్నారు డిల్లీ వ్యాపారులు.
అమెరికన్ బాదం కిలోకు 900 నుండి 580కి తగ్గింది
జీడిపప్పు కిలోకు 1100 710 రూపాయలు తగ్గింది.
ఎండుద్రాక్ష కిలోకు 400 నుండి 230 రూపాయలకు తగ్గింది
పిస్తా 1400 కిలో ఉండేది 1100 కి వచ్చింది
వాల్ నట్స్ కిలో 800తో నిలకడగా ఉంది, ఈసీజన్ లో వాల్ నట్స్ బాగా తింటారు జనం.