Pigmentation | ఇంట్లో పాలు లేకపోతే పాలపొడితో క్షణాలలో పాలు తయారు చేసేస్తాం. అయితే పాల పొడి అనేది ఇన్స్టెంట్ పాలు రెడీ చేయడానికే కాదు.. అందాన్ని సంరక్షించుకోవడానికీ సహాయపడుతుంది అని సౌందర్య నిపుణులు చెబతున్నారు. పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి, కాంతివంతంగా చేస్తుంది. పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలపొడిలోని విటమిన్ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. పాల పొడి కొలాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది క్లెన్సర్ గా పనిచేసి.. చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. చర్మానికి తేమనందించి.. మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. పాలపొడిని మీ బ్యూటీ కేర్ లో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిగ్మెంటేషన్(Pigmentation) సమస్యతో బాధపడేవారు.. చెంచా చొప్పున పాలపొడి, శనగపిండి, ఆరెంజ్ రసాన్ని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టు ముఖానికి ప్యాక్ లా అప్లై చేసి.. 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా తరచుగా చేస్తే ఎండ కారణంగా కమిలిన చర్మం తాజాగా మారుతుంది. రెండు చెంచాల పెరుగు, చెంచా పాలపొడి, అరచెంచా నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. పిగ్మెంటేషన్ మచ్చలు దూరం అవుతాయి.