తెల్ల చక్కెర చాలా మంది దీనికి ఈ మధ్య దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే రుచిగానే ఉంటుంది కాని చాలా రకాల అనారోగ్యాలను తీసుకువస్తుంది. పెద్దలైనా పిల్లలు అయినా దీనికి దూరంగా ఉండాలి. ఇక సాఫ్ట్ డ్రింకులు తాగేవారు కూడా వాటిని మానేయడం బెటర్ అంటున్నారు వైద్యులు. ఇందులో ఉండే షుగర్ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి.
శీతల పానీయాలు, చాక్లెట్ లేదా ఐస్ క్రీం వంటి వాటిని డిమాండ్ చేస్తే పిల్లలకు ఇవ్వద్దు అంటున్నారు.
దీని వల్ల పిల్లల్లో డిప్రషన్ వస్తోంది. ముఖ్యంగా పిల్లలు చాక్లెట్స్ అధికంగా తీసుకుంటారు దీని వల్ల షుగర్ అనేది వారి బాడీలోకి అధికంగా చేరుతుంది. తెల్ల షుగర్ వాడటం వల్ల పిల్లల దంతాలు దెబ్బతింటాయి. మీ పిల్లల బరువును కూడా పెంచుతుంది.
అందుకే దీనికి బదులు మీరు పళ్ల రసాలు పండ్లు కూరగాయలు ఇలాంటివి పెడితే మంచిది.
ఇలా పంచదార ఎక్కువ ఉన్నవి తీసుకుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. పెద్దలు కూడా ఈ విషయం గుర్తు ఉంచుకోవాలి. చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. బరువు పెరుగుతారు.