Joint Pains | చలికాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..? ఇలా చేసి చూడండి..

-

దేశవ్యాప్తంగా ఎముకలు కొరికే చలి గజగజలాడిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత కాస్తంత అధికంగానే ఉంది. సీజన్ ఆరంభంలోనే అదరగొట్టేస్తున్న చలికి.. యువకులు కూడా వణికిపోతున్నారు. అయితే చలికాలం అంటేనే రోగాల కాలంగా కొందరు చెప్తారు. అందుకు ఈ సీజన్‌లో వేధించే ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణం. జలుబు, దగ్గు, వైరఫ్ ఫీవర్లు వంటివి ఈ సీజన్‌లో అధికంగా రావడమే కాకుండా.. ఒక్కసారి వచ్చాయంటే అంత తేలికగా తగ్గను కూడా తగ్గవు. కీళ్ల నొప్పులు(Joint Pains) ఉన్నవారికి ఈ చలికాలం ఉండే నాలుగు నెలలు నరకప్రాయంగా ఉంటుంది. అధిక చలికి శరీరం బిగుసుకుపోతుంది. దీంతో పాటు కీళ్లు పట్టేయడం, నడవడానికి సహకరించకపోవడం వంటి సమస్యలు వీరు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

ఆ సమయంలో సాధారణంగా తీవ్రంగా ఉండే కీళ్ల నొప్పులు ఈ చలికి మరింత అధికంగా బాధిస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందడం కోసం అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. తరచూ వైద్యులను కలుస్తుంటారు. బయటకు వెళ్లాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. అయితే చలికాలంలో పెరిగే కీళ్ల నొప్పులకు కొన్ని చిట్కాలు పాటిస్తే చెక్ చెప్పొచ్చని వైద్యులు చెప్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఒక లుక్కేద్దామా..

కాపడం: చలికాలంలో సాధారణంగానే శరీరం బిగుసుకుంటుంది. అలాంటి సమయంలో కీళ్ల నొప్పులు(Joint Pains) పెరుగుతాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించాలి. అలా చేయడం కోసం రెండు మూడు గంటలకొకసారి వేడి కాపడం వేయడం చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

హైడ్రేషన్: చలికాలంలో చల్లగానే ఉంది కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదని వైద్యులు అంటున్నారు. సాధారణంగానే చలికాలంలో చాలా మంది నీళ్లు తాగడం గణనీయంగా తగ్గిస్తారు. కొందరు ఏడు ఎనిమిది గంటల పాటు నీరు తాగకుండా ఉంటారు. కానీ అలా చేయడం చాలా చెడు ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారు శరీరాన్ని హైడ్రేటెడ్‌(Hydrated)గా ఉంచుకోవాలి. లేనిపక్షంలో శరీరంలో నీటి శాతం తగ్గి కీళ్ల నొప్పులు అధికమవుతాయి.

ఆహారం: చలికాలంలో పెరిగే కీళ్ల నొప్పులను తగ్గించుకుని హుషారుగా ఉండాలంటే తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలన్నది వైద్యులు అంటున్న మాట. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు సల్ఫర్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

ఈ రెండిటినీ తగిన మోతాదులో శరీరానికి అందించడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా కీళ్లనొప్పులు తగ్గుతాయి. వాటితో పాటుగా క్యాబేజీ, బచ్చలికూర, సిట్రస్ ఫ్రూట్స్ అంటే కమలాలు, బత్తాయిలు వంటివి, టమాటాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు అంటున్నారు.

విటమిన్-డి: సాధారణంగానే చలికాలంలో సూర్యరశ్మి కావాల్సినంత అందకపోవడంతో విటమిన్-డీ లోపానికి గురవుతారు. దాని వల్ల కూడా కీళ్ల నొప్పులు అధికమవుతాయి. విటమిన్-డి అనేది ఎములకు ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో అది తగ్గడం వల్ల నొప్పులు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు విటమిన్-డి ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం కూడా కీళ్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు వివరిస్తున్నారు.

Read Also: రోజూ స్పూన్ తేనె తింటే ఏమవుతుందో తెలుసా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chinmoy Krishna Das | చిన్మోయ్ కృష్ణదాస్ కి బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ

ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) కి కోర్టులో...

Andhra Tourist Killed | గోవాలో ఏపీ యువకుడిని కొట్టి చంపిన హోటల్ యాజమాన్యం

Andhra Tourist Killed | గోవాలో ఏపీకి చెందిన యువకుడు దారుణ...