ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. మన ఆరోగ్యం పదిలంగా ఉండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలను సైతం ఇష్టం చేసుకొని తింటుంటాము. అలాగే రోజు ఈ డైట్ ను మెయింటైన్ చేశారంటే నిండు నూరెళ్లు జీవించవచ్చు. ఇంకా మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా జీవించాలంటే ఏ ఆహారపదార్దాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆకుకూరలు, ఫలాలు, బీన్స్, బాదం వంటి గింజలు మనం రోజు తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరి ఎలాంటి వ్యాధులు లేకుండా ఎక్కువ రోజులు జీవిస్తాము. ఎందుకంటే వీటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి.
ఇవి రోజు తీసుకోవడంతో పాటు వీటికి వీలయినంత దూరంగా ఉండడం మంచిది. అవేంటంటే..మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండి మన శరీరానికి హానిచేస్తాయి.