ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి సోమవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు సోమవారం 2224 నమోదయ్యాయి. ఆదివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 4250 కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన మరణాల సంఖ్య 31 గా నమోదైంది. నిన్నటికంటే 2 మరణాలు తక్కువగా చోటు చేసుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.
ఇవాళ మొత్తం 71758 నమూనాలు పరీక్షించారు. గత కొద్దిరోజులుగా రాయలసీమలోని చిత్తూరులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. సోమవారం చిత్తూరు జిల్లాలో అత్యధిక మరణాలు అంటే 6 మంది మరణించారు. అత్యధిక కేసుల రికార్డు కూడా చిత్తూరు జిల్లాకే దక్కింది. ఇవాళ చిత్తూరుజిల్లాలో 409 కేసులు నమోదయ్యాయి.
మరణాల జాబితా చూస్తే చిత్తూరులో 6, కృష్ణాలో 5 మంది, తూర్పు గోదావరిలో 4, శ్రీకాకుళంలో 4, , గుంటూరులో 4, నెల్లూరులో 2, అనంతపురంలో 2, ప్రకాశంలో 2, విజయనగరంలో 1,విశాఖపట్నం 1 చొప్పున మరణించారు . కడప ,కర్నూలు ,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవాళ ఎలాంటి మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 42252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 4714 మంది ఉన్నారు. కరోనా మృతులు 12630 గా నమోదైంది. మొత్తం 18.82 లక్షల్లో 18.27 లక్షల మంది (97శాతం) మంది రికవరీ అయ్యారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 66
చిత్తూరు 409
తూర్పుగోదావరి 299
గుంటూరు 191
వైఎస్సార్ కడప 173
కృష్ణా 222
కర్నూలు 66
నెల్లూరు 116
ప్రకాశం 157
శ్రీకాకుళం 51
విశాఖపట్నం 122
విజయనగరం 93
పశ్చిమ గోదావరి 259
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి…
https://alltimereport.com/curfew-relaxation-in-andhrapradesh/