ఈ మధ్య శ్యామ్ సింగరాయ్ తో థియేటర్లో సందడి చేసిన హీరో నాని ప్రస్తుతం సుందరానికి అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఆ సినిమాకు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రయత్నం చేస్తుంది.
న్యాచురల్ స్టార్ నాని కాలుకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. దీని వల్ల నానిని ప్రముఖ ఆస్పత్రికి తరలించారనే సమాచారం వచ్చింది. అయితే ఇంకా ఈ ఘటనకు సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనితో నాని అభిమానులు ఆందోళనలో ఉన్నారు.