ICAR అద్భుతం..ఒకే మొక్కకు టమాటా, వంకాయ..!

0
81

ఢిల్లీలోని ఐసీఏఆర్ సారథ్యంలో వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ అద్భుతం చేసింది. అంటుకట్టడం ద్వారా ఒకే మొక్కకు టమాట, వంకాయలు కాసే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసి చూపించింది. సంకరజాతి వంకాయ రకం కాశీ సందేశ్‌ను, టమాటా రకం కాశీ అమన్‌తో అంటుకట్టడంతో ఇది సాధ్యమైందంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ కొత్త మొక్కను 15 రోజుల నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. తొలి దశలో వంకాయ, టమాటా కొమ్మలు ఒకేలా పెరిగేలా చూసుకున్నారు. సేంద్రియ ఎరువుతో పాటు రసాయన ఎరువులు వాడారు. ఇలా పెంచిన అంటు మొక్కకు 60-70 రోజుల తర్వాత వంకాయలు, టమాటాలు కాయడం మొదలైంది. ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానం పట్టణం, పట్టణ శివారు ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని ఐసీఏఆర్ పేర్కొన్నది.