Tongue | నాలుక తేడాగా ఉంటే పెద్ద ప్రమాదమే..!

-

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. అంటే ఒక్కొక్కరికి ఓ టేస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వైరాగ్య మార్గంలో ఉన్న వారు తప్ప.. ఆహారాన్ని రుచిరుచిగా తినాలని అనుకుంటారు. అందుకే తాము తీసుకునే ఆహారాన్ని కూడా రుచిని బట్టే ఎంచుకుంటారు. ఆహారం అంటే ఏది రుచికరంగా ఉంటుందనే ఆలోచిస్తారు. నాలుకకు తగ్గా రుచి ప్రకారమే ఆహారం తీసుకుంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రుచిని గ్రహించే సామర్థ్యం నాలుక(Tongue)కు మందగిస్తుంది. దానినే అరుచి అని అంటారు. చాలా మంది దీనిని చాల తేలికగా తీసుకుంటారు. కానీ అలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా నాలుక రుచి మందగించినా, రుచిని గ్రహించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినా చాలా ప్రమాదంలో ఉండే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు.

- Advertisement -

మన నాలుక తన సామర్థ్యాన్ని శరీరం అస్వస్థకు లోనైప్పుడు మాత్రమే కోల్పోతుందని చెప్తున్నారు. అందుకు జ్వరం ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. శరీరంలో జ్వరం ఉన్న సమయంలో ఏమి తిన్నా చేదుగా అనిపిస్తుందని, రుచి తెలియడం మొదలైతే జ్వరం తగ్గినట్టేనని వైద్యులు కూడా నమ్ముతారని చెప్తున్నారు. అదే విధంగా అకస్మాత్తుగా నాలుక తన సామర్థ్యాన్ని కోల్పోయిందంటే శరీరంలో ఏదో అస్వస్థత ఉండటమే, వచ్చే ప్రమాదం ఉండటమే కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. పలు తీవ్ర సమస్యలను కూడా ఈ అరుచి సూచిస్తుందని అంటున్నారు. సాధారణంగానే మనం అనారోగ్యంతో ఉన్న సమయంలో నాలుక రుచి, రంగు మారతాయి. అందుకే అనేక సందర్భాల్లో వైద్యులు చికిత్స సమయంలో నాలుక రంగును కూడా పరిశీలిస్తారని నిపుణులు వివరిస్తున్నారు. మరి ఇంతకీ అరుచి ఎటువంటి ఆరోగ్య సమస్యలను సంకేతాలిస్తుందో చూద్దామా..

కోవిడ్ 19: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. లక్షణాల్లో అరుచి కూడా ఒకటని వైద్యులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని నిర్ధారించింది. ఈ మహమ్మారి సోకిన చాలా మంది ప్రజలు నాలుక రుచిని కోల్పోయారు. కరోనా వస్తే వచ్చే ముఖ్యమైన లక్షణాల్లో అరుచి కూడా ఒకటి.

నరాల సమస్యలు: అల్జీమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్ వ్యాధి వంటి అనేక నాడీ సంబంధిత వ్యాధులు వచ్చినా, వచ్చే ప్రమాదం ఉన్న సమయంలో కూడా నాలుక తన రుచి సామర్థ్యాన్ని కోల్పోతుంది. వీటితో పాటు పలు ఇతర నాడీ వ్యవస్థ సమస్యల వల్ల కూడా నాలుక రుచిని గ్రహించే సామర్థ్యంలో మార్పులను కలిగిస్తాయి.

దగ్గు – జలుబు: చాలా సాధారణంగా వచ్చే రోగాలలో దగ్గు, జలుబు తప్పకుండా ఉంటాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయంటే దగ్గు, జలుబు వచ్చేస్తాయి. ఇవి వచ్చిన సమయంలో కూడా నాలుక(Tongue) రుచిని కోల్పోవచ్చు. జలుబు చేసిన సమయంలో ముక్కులు మూసుకుపోయినట్లు అనిపిస్తుందని, మన రుచిని నిర్ణయించడానికి ముక్కు కూడా బాధ్యత వహిస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందువల్లే దగ్గు, జలుబు చేసినా అరుచి కలుగుతుందని చెప్తున్నారు వైద్యులు.

ఫ్లూ: ఫ్లూ జ్వరాలు సోకిన సమయంలో అత్యంత సాధారణంగా వచ్చే లక్షణం అరుచి. ఎవరైనా ఫ్లూతో బాధపడుతున్నప్పుడు, నాలుక రుచి కోల్పోవచ్చు. ఇది సాధారణ శారీరక సమస్య, కానీ కొన్ని సందర్భాల్లో ఇది వ్యాధి లక్షణం కూడా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మధుమేహం: మధుమేహ రోగులు తరచుగా వారి నాలుక రుచిలో మార్పులను ఎదుర్కొంటారు. వారి రక్తంలో చక్కెర స్థితిని తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది.

దంత సమస్యలు: దంత సమస్యలు కూడా నాలుక రుచిని ప్రభావితం చేస్తాయి. చిగురువాపు, కుహరం, నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. దంత సమస్యలకు వైద్యం చేయించుకున్న ప్రారంభ దశల్లో కూడా కొందరిలో ఈ అరుచి కనిపిస్తుందని వైద్యులు చెప్తున్నారు.

Read Also: అతిదాహం.. ఈ రోగాలకు సంకేతమా..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...