రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి..

0
94

మనిషి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం తీసుకునే ఆహారం, వ్యాయామమే కాకుండా మంచి నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాలు కావడంతో చాలామంది ఎక్కువసేపు నిద్రపోవడం లేరు. ఒకవేళ రాత్రిళ్ళు నిద్రపోదామన్న నిద్రపట్టక తీవ్ర ఇబ్బందులు పడేవారు చాలామందే ఉన్నారు. అందుకే అలాంటి వారు ఒక్కసారి ఈ చిట్కాలు పాటించి చూడండి..

రాత్రిళ్ళు నిద్రపట్టేలా చేయడంలో గసగసాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కేవలం దీనికే కాకుండా..కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా, మలబద్దక సమస్య తగ్గించడంలో కూడా గసగసాలు ఉపయోగపడతాయి. రోజూ ఆహారంలో గసగసాల్ని వాడడం వల్ల నిద్రలేమి సమస్య మీ దరికూడా చేరకుండా కాపాడుతుంది.

రోజూ పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పొడిని కొద్దిగా వేసుకొని తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాల్ని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి. ఇంకా  గసగసాలను కాసేపు ఫ్రై చేసి, చక్కెర కలుపుకొని ఉదయం సాయంత్రం అరచెంచాడు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.