హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ఈజీగా తగ్గించుకోండి

Troubled with a hangover?

0
104

ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా తాగుతుంటాం. అక్కడి వరకు బానే ఉన్న తెల్లారి చాలా మందిని హ్యాంగోవర్ వేధిస్తుంటుంది. దీనితో మళ్లీ జీవితంలో తాగకూడదనే భావనే కలుగుతుంది. కొందరు అయితే నిత్యం ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హ్యాంగ్ఓవర్ చాలా సాధారణంగా ఉంటుంది. మీరు కూడా హ్యాంగోవర్ తో బాధపడుతున్నారా..? అయితే హ్యాంగోవర్ నుంచి ఎలా బయట పడవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక వ్యక్తి అవసరం కోసం మద్యం సేవించినప్పుడు అతనికి ఇబ్బంది కలిగించే అనేక లక్షణాలను అతను అనుభవిస్తాడు. దీనిని హ్యాంగోవర్ అంటారు.” హ్యాంగోవర్ ప్రభావం ఆల్కహాల్ తాగిన కొన్ని గంటల తర్వాత మొదలై ఆ తదుపరి 24 గంటల వరకు ఉంటుంది. సాధారణంగా హ్యాంగోవర్ అయినప్పుడు తలనొప్పి, దాహం, గొంతు ఎండిపోవడం, అలసట, వాంతులు, వికారం వంటివి ఉంటాయి. అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు.

ఆల్కహాల్ తాగే వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ తాగినప్పుడు హ్యాంగోవర్ ఉండదు. మద్యం మన శరీరంలో ఉండే నీటి శాతాన్ని పీల్చేస్తుంది. ఈ కారణంగా తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకనే ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అదే విధంగా అరటిపండు, పీనట్ బట్టర్, మామిడి, పాస్తా వంటివి తీసుకుంటే హైడ్రేట్ గా ఉండొచ్చు. నిమ్మకాయ కూడా హ్యాంగోవర్ సమస్యలను తగ్గిస్తుంది.

అలానే తేనే తీసుకోవడం వల్ల ఆల్కహాల్ని తొందరగా బయటకు పంపేలా చేస్తుంది. హ్యాంగోవర్ తో పాటు తల పట్టేసినట్టు ఉంటే అల్పాహారం సమయంలో గుడ్లని తీసుకోండి. ఇలా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ నుంచి త్వరగా బయటపడవచ్చు. హ్యాంగోవర్ తగ్గాలంటే ఆరెంజ్, నిమ్మ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య ఉండదు.