ఈ రోజుల్లో మన ఆహార అలవాట్లు చాలా వరకూ మారిపోతున్నాయి. ముఖ్యంగా సరైన సమయానికి ఫుడ్ తినడం లేదు. అంతేకాదు పోషకాలు ఉండే ఫుడ్ కూడా తినడం లేదు. ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు ఇలాంటి సమయంలో అనేక జబ్బుల పాలవుతున్నారు జనం. అందుకే గ్యాస్ సమస్యలు, మలబద్దకం, పైల్స్ ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. ఏదైనా ఆహారం తిన్న తర్వాత గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్య ఉన్న వారు కొన్ని ఆహార పదార్థాలు తినడం మానుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
1. తరచూ బీన్స్ తినే అలవాటు ఉంటే మానుకోండి
2. కొవ్వు ఉండే ఆహరపదార్దాలు ఏమీ తీసుకోవద్దు
3. ఇక మీరు తినే ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు- ఉప్పు చిప్స్ అస్సలు తినవద్దు
4. గోధుమతో చేసిన ఫుడ్ మితంగా తీసుకోండి
5. హెవీ గ్యాస్ లు ఉండే కూల్ డ్రింక్స్ అస్సలు తాగవద్దు.