బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి..

0
117

ఈ మధ్య కాలంలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. తాము ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేరని నిరాశ చెందకండి. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు..ఈ కింది సూత్రాలు తెలుసుకొని.. వాటిని పాటిస్తే మంచి ఫలితం ఉందంటున్నారు నిపుణులు.

బరువు తగ్గాలని అనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ ని అస్సలు మానెయ్యకూడదు. ఆహారాన్ని నివారించడం శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారు తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు పుష్కలంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. ఇది కేవలం బరువు తగ్గడానికి కాకుండా..మొత్తం శరీరానికి కూడా మంచిది. ప్రతి రోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయండి. చక్కెర ఉన్న పదార్దాలను అస్సలే తినకూడదు. సరిగ్గా నిద్రపోకపోవడం కూడా ఈ బరువు పెరగడానికి కారణం. అందుకే రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పొందడానికి ప్రయత్నించండి.