బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ సులభమైన చిట్కాలు మీ కోసమే..

0
98

ప్రస్తుత యువతకు బరువు తగ్గించుకోవాడం పెద్ద సవాల్ గా మారింది. బేకరీలో దొరికే వివిధ రకాల ఆహారపదార్దాలు తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల మందులు వాడుతూ తమకు తామే కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటారు. కావున బరువు తగ్గడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే శరీరానికి ఎలాంటి హాని జరగకపోగా..మంచి ఫలితాలు లభిస్తాయి.

బరువును తగ్గించడంలో మజ్జిక అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే మజ్జిగలో మసాలా దినుసులను కూడా వాడుకోవచ్చు. ఇంకా సొరకాయ తేలికగా జీర్ణమవుతుంది. కావున బరువును తగ్గడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది.

అంతేకాకుండా సొరకాయ వారానికి రెండుసార్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడంతో పాటు..జీర్ణసంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. వేసవిలో లెమోనేడ్ తాగడం ఆరోగ్యానికి మేలు చేకూరడమే కాకుండా..బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వేసవిలో పెరుగుని తినడం వల్ల వేడి పెరకకుండా అడ్డుకొని..బరువును తగ్గిస్తుంది.