‘తులసి’తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

-

Tulsi Benefits | ‘తులసి’ చెట్టును పూజించి సంప్రదాయం మన దేశంలో శతాబ్దాల క్రితం నుంచే ఉంది. ప్రతి ఒక్కరు కూడా తులసి చెట్టును దేవతలా భావిస్తారు. ఆ సంప్రదయంగానే ఇప్పటికీ చాలా మంది ఇంట్లో తులసి మొక్కను పెంచుతుంటారు. కానీ ఈ తులసి చెట్టు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా. వాటిని గ్రహించే అప్పట్లో మన పూర్తీకులు ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలని నిర్ణయించారని కొందరు మేధావులు చెప్తుంటారు. అదంతా ఇక్కడ అనవసరం. ఇంతకీ తులసి చెట్టు ఆకులు తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా..!

- Advertisement -

రోజుకు 5 నుంచి 7 తులసి ఆకులను క్రమం తప్పకుండా తింటే రోజుల వ్యవధిలోనే మంచి ఫలితాలను గమనిస్తాం. శరీరంలో ఉన్న కొన్ని రుగ్మతలను తగ్గించడంతో పాటు మరెన్నో వ్యాధులు మనకు సోకకుండా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చెడు కొవ్వును తగ్గించడంలో కూడా తులసి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే తులసిని ఆయుర్వేదంలో కూడా దివ్యఔషధంలా పేర్కొంటారు.

తులిసి ఆకులను రోజూ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ స్థాయులను తగ్గించడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. తులసిలో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలే ఇందుకు కారణమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి.

Tulsi Benefits | వీటితో పాటుగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ని తగ్గించే సమ్మేళనాలు కూడా తులసి పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటితో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి తులసి ఆకులు.

చర్మ వ్యాధులకు కూడా తులసి ఆకులు గొప్పగా పనిచేస్తాయి. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొండి చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు శ్వాసకోశ సమస్యలు, మూత్ర సంబంధిత రుగ్మతలు, కడుపు పూత, ఆర్థరైటిస్‌ను కూడా తగ్గించే శక్తి తులసి ఆకులకు ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తులసి ఆకులతోనే కాదు తులసి కొమ్మలు, తులసి వాసన పీల్చడం ద్వారా కూడా అనేక ఆరోగ్య సంబంధిత లాభాలు ఉంటాయని వైద్య, ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

Read Also: బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...