Turmeric Side Effects | ఏదైనా మితంగానే ఉండాలని, మితిమీరితే అమృతమైనా కాలకకూట విషయంతో సమానమవుతుందని పెద్దలు అంటారు. ఇందుకు పసుపే పెద్ద నిదర్శనమని ప్రస్తుతం ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పసుపు వల్లే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపును ఎలా తీసుకున్నా లాభాలు పుష్కలంగా ఉంటాయి. దెబ్బలు, ఎలర్జీ వచ్చి ప్రాంతంలో తాపడంలా కూడా పసును వాడొచ్చు. తద్వారా మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే పసుపు వల్లే వచ్చే సమస్యలేంటి అంటే ఎవరూ ఏం చెప్పలేరేమో..? కానీ మంచి చేస్తుంది కదా పసును విచ్చలవిడిగా వాడేస్తే.. అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనిని బట్టే ఏదైనా మితంగానే ఉండాలని అర్థం చేసుకోవాలని, ఏది అతి అయినా సమస్యలు తప్పవని అంటున్నారు. మరి దాదాపు ప్రతి వంటలో వినియోగించే పసుపు వల్లే కలిగే సమస్యలేంటో ఒకసారి చూద్దాం..
Turmeric Side Effects:
స్కిన్ ఎలర్జీ: పసుపును అధికంగా తీసుకోవడం వల్ల అలెర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఎరుపు దద్దుర్లు, దురద, చెమట పెరుగుతుంది. చర్మంపై మొటిమల సమస్య కూడా అధికమవుతుంది.
రక్తం పల్చబడటం: పసుపులో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాల వల్ల శరీరంలోని రక్తం తన గడ్డకట్టే గుణాన్ని కోల్పోతుంది. తద్వారా రక్తం పల్చబడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. ఏదైనా గాయం జరిగితే రక్తస్రావం అధికంగా ఉంటుంది. ఆ రక్తస్రావాన్ని అదుపు చేయడం కూడా కాస్తం కష్టతరమవుతుంది.
అజీర్ణం: పసుపు ఎక్కువగా తినడం వల్ల అజీర్ణ సమస్య ఎదురవుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, కడుపు నోప్పి, మలబద్దకం కూడా వచ్చే ప్రమాదం ఉంది. పసుపు అధికంగా తినడం వల్ల అల్సర్ కూడా రావొచ్చు. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు కూడా వస్తాయి. రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పసుపు తీసుకోవడం వల్ల అజీర్ణం అధికం కావొచ్చని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెప్తుంది.
మూత్రపిండాల్లో రాళ్లు: పసుపులో ఉండే ఆక్సలేట్లు.. యూరినరీ ఆక్సలేజ్ స్థాయిని పెంచుతుంది. పసుపులో ఉండే రెండు మూడు శాతం ఆక్సలేట్లలో 91శాతం కరుగుతాయి. వాటిని శరీరం గ్రహిస్తుంది. దాని కారణంగా శరీరంలోని ఆక్సలేట్ స్థాయి పెరిగి కాల్షియంలో వాటి నిల్వ అధికమవుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది, దాంతో పాటుగానే పసుపులో ఉండే మినరల్స్ కూడా కిడ్నీ స్టోన్స్‌కు దారి తీస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.